AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నా ఫేవరెట్‌ ఆలీగారు.. ఆసక్తికర కామెంట్లు చేసిన అక్కినేని సమంత

ఓ వైపు కమెడీయన్ గా రాణిస్తూనే మరోవైపు హీరోగా మెప్పించిన నటుడు ఆలీ. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Samantha: నా ఫేవరెట్‌ ఆలీగారు.. ఆసక్తికర కామెంట్లు చేసిన అక్కినేని సమంత
Samantha
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2021 | 5:57 PM

Share

Andaru Bagundali Andulo Nenundali : ఓ వైపు కమెడీయన్ గా రాణిస్తూనే మరోవైపు హీరోగా మెప్పించిన నటుడు ఆలీ. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆలీ, సీనియర్ నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను మోహన్‌‌‌‌ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. అలాగే శ్రీపురం కిరణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్‌.రహమాన్‌ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్‌ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగాపరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి రెండు పాటలు మార్కెట్‌లోకి విడుదలై ఆకట్టుకుంటున్నాయి.  మొదటి పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే.. రెండో పాటను రియల్ హీరో సోనూసూద్‌ విడుదల చేశారు. తాజాగా మూడో పాటను గ్లామరస్‌ క్వీస్‌ సమంతా అక్కినేని విడుదల చేసి ఆలీకి సినిమా టీమ్‌కి అభినందనలు తెలియచేశారు.

ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ –‘‘ ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే నా ఫేవరేట్‌ ఆలీగారు ప్రొడక్షన్‌ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్‌ లైప్‌ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్‌ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఇట్స్‌ ఏ స్లైన్‌ ఆఫ్‌ లైఫ్, ఎందుకంటే రియలిస్టిక్, అండ్‌ రిలేటబుల్‌ స్టోరీ. అందుకే ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆలీగారి మీద నమ్మకం ఉంది’’ అన్నారు. అలాగే ఆలీ మాట్లాడుతూ –‘‘సమంతా గారు నేను అడగ్గానే నా సినిమాలోని మూడో పాటను విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తను చేస్తున్న ‘శాకుంతలం’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సమంతా గారు మాట్లాడుతూ మీ బ్యానర్‌ పేరు ఏంటి అని అడిగితే ఆ వుడ్, ఈ వుడ్‌ ఎందుకు అని ఆలీవుడ్‌ అని బ్యానర్‌ పేరు పెట్టాను అని నవ్వుతూ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda: వన్ ఆఫ్ ది బెస్ట్ అంటూ.. అమలాపాల్ వెబ్‌‌‌‌‌సిరీస్ పై ప్రశంసలు కురిపించిన రౌడీ

Godzilla vs Kong: ఓటీటీలో సందడి చేయనున్న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..