Srikanth: శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టుంది.. శ్రీకాంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది.

Srikanth: శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టుంది.. శ్రీకాంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Srikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2021 | 9:00 PM

Srikanth: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమాన్ని గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. నా మొదటి సినిమా కూడా ఇక్కడే షూట్ చేశాను అన్నారు. ఈ సక్సెస్ మీట్ ఇక్కడ జరగడం ఎంతో సంతోషంగా ఉంది అని శ్రీకాంత్ అన్నారు.

బోయపాటి గారితో సరైనోడు, అఖండ సినిమాలు చేశాను. బాలయ్య గారితో శ్రీరామరాజ్యంలోనూ చేశాను. వరదరాజులు పాత్ర ఇలా ఉంటుందని, వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకంటే ఎక్కువగా నా మీద ఆయనకే నమ్మకం ఉంది. బాలయ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఎనర్జీ ఉంటుంది. ఆయన్ను తలుచుకుంటే మాకు ఎనర్జీ వస్తుంటుంది అన్నారు. ఈ సినిమా విడుదలైనప్పుడు ఉదయం నుంచి పడుకోలేదు. అమెరికా నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపించాయి. వరదరాజులు పాత్రను కూడా ప్రేమించినందుకు థ్యాంక్స్ అని శ్రీకాంత్ అన్నారు. విలన్‌గా చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ ఈ సినిమాతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. కెమెరామెన్ రామ్ ప్రసాద్‌తో నేను హీరోగా ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు విలన్‌గానూ అద్భుతంగా చూపించారు. ఇక శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టుంది. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఏదో ఉంది. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతకు ధైర్యం కావాలి. ఈ సినిమా ఆడాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. అందుకే అందరి గుండెల్లో ఈ సినిమా నిలిచిపోయింది. సినిమా ఇండస్ట్రీ బతకాలి.. అన్ని సినిమాలను చూడండి’ అని అన్నారు శ్రీకాంత్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!