Maha Samudram: నేను ఇప్పుడు స్టార్‌ని కానీ వాడు ఎప్పుడో స్టార్ అయ్యాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శర్వానంద్
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.
Maha Samudram:శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శర్వా మాట్లాడుతూ.. ‘ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.. అలానే మహా సముద్రంలో కూడా కథ మాత్రమే హీరో. తప్పకుండా ఇది విడుదలయ్యాక తెలుగు సినిమారా అని అందరూ గర్వంగా చెబుతారు. మూడు రోజుల్లో సినిమా ఓకే అయిపోయింది. 9 మందితో కొనసాగే ఈ కథ చాలా బావుంటుంది. దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు అజయ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మహాసముద్రం సినిమా అనేది లవ్ స్టొరీ. ఎక్కువగా మహా పాత్ర చుట్టే ఉంటుంది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. అదితి చాలా బాగా చేసింది. ఈ సినిమాతో సిద్దార్థ్ వంటి మంచి స్నేహితుడు దొరికాడు అని చెప్పడంతోనే సినిమా సక్సెస్ అని అర్థమైపోయింది. అందరూ శర్వా స్టార్ అన్నా కూడా సిద్దార్థ్ ఎప్పటి నుంచో ఒక స్టార్. రంగ్ దే బసంతి, బొమ్మరిల్లు వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేసి హంబుల్ గా మాట్లాడుతున్నాడు. అదే అతని గొప్పతనం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అక్టోబర్ 14న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అంటే దసరాకు. ప్రతి పండగ సమయంలో నేను హిట్ కొట్టాను. ఇప్పుడు కూడా మహాసముద్రంతో హిట్ కొడుతున్నాం“ అని అన్నారు.
MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..