MAA elections 2021: గెలిచినందుకు హ్యాపీగా ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధగా ఉంది : శ్రీకాంత్
'మా' వార్ ముగిసింది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మధ్య జరిగిన ఈ పోరులో మంచు విష్ణు ఘానవిజయం సాధించారు. మొదటినుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు అలాగే విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జారింది.
MAA elections 2021: ‘మా’ వార్ ముగిసింది. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్య జరిగిన ఈ పోరులో మంచు విష్ణు ఘానవిజయం సాధించారు. మొదటినుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు అలాగే విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జారింది. ఒకరినొకరు తిట్టుకోవడం, బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లు తమ ప్యానెళ్లతో కలిసి ముమ్మర ప్రచారాన్నిచేయడం. ఎన్నికల ముందు రోజు వరకు ఒకరికి ఒకరు సీరియస్ వార్నింగులు ఇచ్చుకుంటూ వేడి పెంచారు. ఇక మా ఎన్నికల వేళా రానే వచ్చింది నిన్న ( అక్టోబర్ 10న ) ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో మంచు విష్ణు ఘాన విజయం సాధిచారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. విష్ణు గెలుపుతో కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలిచారు. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు.
ఇక ఈ ఎన్నికల్లో తన విజయం గురించి నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తాను విజయం సాధించిన దానికంటే ప్రకాష్ రాజ్ ఓడిపోయారని బాధగా అనిపించింది అంది శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. అలాగే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు. ఇక మంచు విష్ణు విజయం సాధించడంతో సినీ పెద్దలు పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :