Sukumar : అల్లు అర్జున్‌తో మరో సినిమా.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ సుకుమార్..

టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ స్టైల్‌‌కి, అతడి డాన్స్‌‌కు అభిమానులు నీరాజనాలు పడుతుంటారు..

Sukumar : అల్లు అర్జున్‌తో మరో సినిమా.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ సుకుమార్..
Sukumar
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 12:31 PM

Sukumar : టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ స్టైల్‌‌కి, అతడి డాన్స్‌‌కు అభిమానులు నీరాజనాలు పడుతుంటారు.. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్నీ ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ సినిమా ఇది.. అలాగే అలవైకుఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా దాంతో ఈ సినిమాలో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అందుకు తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందబోతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉంటుందని తెలుస్తుంది. పుష్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది కానీ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు బన్నీ అప్ కమింగ్ సినిమాలగురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అందేంటే అల్లు అర్జున్ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమాచేయనున్నారట. గతంలో ఆర్య‌, ఆర్య‌-2 సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ బన్నీ కాంబినేష‌న్‌లో ఆర్య‌-3 కూడా ఉంటుంద‌ట‌. ఈవిషయాన్ని స్వయంగా సుకుమార్ చెప్పడం విశేషం. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సుకుమార్  .. ఓ  ఆర్య-3 స్క్రిప్ట్ సిద్ధం అవుతోంద‌ని చెప్పారు. అలాగే త్వరలోనే సినిమా పట్టేలెక్కిస్తామని కూడా తెలిపారు. దాంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 మరిన్ని ఇక్కడ చదవండి :  MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..