AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవితేజ ‘క్రాక్’ టీజర్: భయపెట్టిస్తూ.. అదరగొట్టాడు

'ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా..

రవితేజ 'క్రాక్' టీజర్: భయపెట్టిస్తూ.. అదరగొట్టాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 5:47 PM

Share

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. శివరాత్రి సంద‌ర్భంగా `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేశారు చిత్ర యూనిట్.

టీజర్: ‘ఒంగోల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా.. అంటూ తనదైన మ్యానరిజంతో రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది’.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. “మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. రవితేజ నుండి మీరు ఆశించే అన్ని అంశాలు ఉంటాయన్నారు. టీజర్‌లో చూసింది చాలా తక్కువని.. సినిమాలో ఇంకా చాలా ఉంటుందన్నారు. మా యూనిట్‌కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా డి ఒ పి విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నామని’ ఆశాభావం వ్యక్తం చేశారు డైరెక్టర్ గోపీచంద్.

కాగా.. ఈ సినిమాలో ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు నటించారు.

Follow Us