Tollywood : రూమర్స్‌తో టెన్షన్ పడుతోన్న కొరటాల..!
తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించే అంశాలతో పాటు మెసేజ్ ఇస్తూ..తన మూవీస్‌కు సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నారు
Tollywood : తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించే అంశాలతో పాటు మెసేజ్ ఇస్తూ..తన మూవీస్‌కు సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బాస్టర్ తర్వాత చిరంజీవితో మూవీని ఓకే చేయించుకున్నాడు కొరటాల. ఇది అందరికి దక్కే అవకాశం కాదు. మెగాస్టార్‌ని డైరెక్ట్ చెయ్యాలంటే..మాములు విషయం కాదు. బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, హరీశ్ శంకర్ లాంటి ఎంతోమంది మాస్ దర్శకులు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కేవలం నాలుగంటే నాలుగు సినిమాలతో ఈ అవకాశాన్ని ఒడిసిపట్టాడు కొరటాల.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీపై రోజుకో గాసిప్ చక్కర్లు కొట్టడం కొరటాలకు పెద్ద తలనొప్పిగా మారిందట. ముందు.. సినిమాలో రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మహేశ్‌బాబుకు, కొరటాల శివకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా..సూపర్ స్టార్‌ను చిరు మూవీలో గెస్ట్ అప్పిరియన్స్ ఇప్పించబోతున్నారని గతం వారం రోజులుగా ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం జోరందుకుంది. అసలే చిరంజీవి సినిమా. అంచనాలు అంబరాన్ని అంటుతాయి. దానికి ఈ గాసిప్స్ వల్ల ఫ్యాన్స్ ఇంకొంచం ఎగ్జైట్ అయితే..వారిని సంతృప్తి పరచడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని డైరెక్టర్ పీల్ అవుతున్నాడట. కొరటాల గత సినిమాలు చూసుకుంటే అవి హీరో రేంజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లినవే. మరి తాజా చిత్రంతో అంచనాలను అందుకుని కొరటాల శివ చిరు ఫ్యాన్స్‌కు ఎటువంటి మీల్స్ పెడతాడో చూడాలి.