దారుణం…మహిళా ఉద్యోగులను నగ్నంగా నిలబెట్టి..
ఎన్నాళ్లీ మూఢ దోరణులు, ఎందుకు మహిళల పట్ల ఇంత సంకుచిత భావం. అమ్మాయిలు నెలసరిలో క్యాంటీన్‌లోకి ప్రవేశిస్తున్నారని గుజరాత్ రాష్ట్రం భుజ్‌లోని ఓ కాలేజ్ యాజమాన్యం వారి లోదుస్తులు విప్పి తనిఖీలు చేయించిన దారణ ఘటన మరవకముందే..అదే రాష్ట్రంలో మరోసారి షాక్‌కి గురిచేసే ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.

ఎన్నాళ్లీ మూఢ దోరణులు, ఎందుకు మహిళల పట్ల ఇంత సంకుచిత భావం. అమ్మాయిలు నెలసరిలో క్యాంటీన్‌లోకి ప్రవేశిస్తున్నారని గుజరాత్ రాష్ట్రం భుజ్‌లోని ఓ కాలేజ్ యాజమాన్యం వారి లోదుస్తులు విప్పి తనిఖీలు చేయించిన దారణ ఘటన మరవకముందే..అదే రాష్ట్రంలో మరోసారి షాక్‌కి గురిచేసే ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. సూరత్ మున్సిపల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌లో ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్లిన 10 మంది మహిళా మునిసిపల్ ట్రైనీ క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయం బయటకు పొక్కడంతో…తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఘటనపై సీరియస్ అయిన సూరత్ మునిసిపల్ కమిషనర్..వెంటనే విచారణకు ఆదేశించారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. బాధిత మహిళల్లో పెళ్లికాని వారు కూడా ఉన్నారని..వారికి కూడా గర్భ నిర్దారణ పరీక్షలు చేసినట్లు ఎస్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది.
అయితే.. ఎస్ఎంసీ నిబంధనల ప్రకారం.. ట్రైనింగ్‌లో ఉన్న ఉద్యోొగులు తమ ఫిట్‌నెస్‌ను ఫ్రూవ్ చేసుకునేందుకు కొన్ని ఫిజికల్ టెస్టులు తప్పనిసరని అధికారులు తెలిపారు. ట్రైనింగ్ ముగించుకున్న మహిళా ఉద్యోగులు..కొందరు టెస్టుల కోసం గురువారం ఆస్పత్రికి వెళ్లగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడికి చేరుకున్న ఉద్యోగిణులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచిన మహిళా వైద్యులు..అందరిని ఒక వరసలో నగ్నంగా నిల్చోబెట్టి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఇది పూర్తిగా అమానవీయమని ఆగ్రహం వ్యక్తం చేసింది.