Nirbhaya Case Latest Updates : నిర్భయ కేసు.. వినయ్ శర్మ పిటీషన్ కొట్టివేత..
నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని అతని తరఫు లాయర్ ఏపీ. సింగ్ దాఖలు చేసిన పిటిషన్.
Nirbhaya Case Latest Updates : నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. తనకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను శనివారం న్యాయస్థానం విచారించింది. వినయ్ లాయర్ అతడి పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ.. తన క్లయింటు తన తల్లినే గుర్తించలేని స్థితిలో ఉన్నాడని, మానసిక ఆందోళనతో ఇటీవల ఆత్మహత్యా యత్నం చేశాడని లాయర్ సింగ్ తెలిపారు. అయితే ఈ వాదనతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ విభేదిస్తూ.. వినయ్ తన తల్లికి, తన న్యాయవాదికి ఈ మధ్యే రెండు సార్లు ఫోన్ చేశాడని తెలిపారు. పైగా ఈ దోషి గతంలో తన మానసిక అనారోగ్యానికి సంబంధించి వైద్య చికిత్సలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన అన్నారు. వినయ్ కావాలనే తన తలను గోడకు బాదుకుని గాయాలు చేసుకున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నారు. కాగా- ఈ దోషి ఆరోగ్య పరిస్థితి, ఆత్మహత్యా యత్నానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని తీహార్ జైలు అధికారులు కోర్టుకు అందజేశారు. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.