భారత పర్యటనలో ట్రంప్ వెంట.. మెలనియా .. ఇవాంకా కూడా !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25  తేదీల్లో భారత సందర్శనకు రానున్న నేపథ్యంలో.. ఆయన వెంట.. ఆయన భార్య మెలనియా , కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా రానున్నారు. పబ్లిక్ ఈవెంట్లు, కార్యక్రమాలలో మెలనియా,  ఇవాంకా

భారత పర్యటనలో ట్రంప్ వెంట.. మెలనియా .. ఇవాంకా కూడా !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:45 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25  తేదీల్లో భారత సందర్శనకు రానున్న నేపథ్యంలో.. ఆయన వెంట.. ఆయన భార్య మెలనియా , కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా రానున్నారు. పబ్లిక్ ఈవెంట్లు, కార్యక్రమాలలో మెలనియా,  ఇవాంకా కలిసి మెలిసి ఉన్నట్టు కనిపించినప్పటికీ,, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య రహస్యంగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తన భర్త జరెద్

కుష్నర్ తోబాటు ఇవాంకా భారత్ రాబోతోంది. వీరంతా ఆగ్రాలోని తాజ్ మహల్ ని సందర్శించిన అనంతరం అహమ్మదాబాద్ బయల్దేరివెళ్ళనున్నారు. ట్రంప్ వెంట వచ్ఛే ప్రతినిధి బృందంలో వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, ఇంధన శాఖ మంత్రి డాన్ బ్యులెట్, వైట్ హౌస్ స్టాఫ్ చీఫ్ మిక్ ముల్వనె, ఎన్ ఎస్ ఏ రాబర్ట్ సి ఓ బ్రిన్ తదితరులున్నారు. ఇలా ఉండగా.. ట్రంప్ రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య భారీ ఒప్పందం కుదరకపోవచ్చు. అయితే యుఎస్ కు చెందిన లాకర్ హీడ్ మార్టిన్ నుంచి 24 మల్టీ రోల్ యాంటీ సబ్ మెరైన్ హెలీకాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు ఇండియా డీల్ కుదుర్చుకోవచ్ఛు. ఏమైనా..ఇండియాకు మెలనియా, ఇవాంకా కలిసి రావడం ఇదే మొదటిసారి. ఇవాంకా 2017 నవంబరులో హైదరాబాద్ ను విజిట్ చేశారు.