AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కక్ష్య లోపలివరకూ.. అంతరిక్ష ‘ఛేదన’లో స్పేస్ ఎక్స్.. అడ్వెంచర్స్ లో ముందడుగు

రోదసిలో అడ్వెంచర్స్ కు శ్రీకారం చుడుతోంది ఎలన్ మాస్క్ ఆద్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. ఇందులో భాగంగా నలుగురు టూరిస్టులను భూ కక్ష్యలోపలివరకూ.. ఇప్పటివరకూ ఏ వ్యోమగామి కూడా ఎంటర్ కాని  డీపర్ ఆర్బిట్ లోనికి వీరిని పంపనుంది. మరో రెండేళ్ల కల్లా.. 2022 నాటికి.. లాంచ్ కానున్న ఈ ప్రాజెక్టుకు 100 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే వ్యయమవుతుందని అంచనా. ఈ మిషన్ కు సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ వాషింగ్టన్ లోని స్పేస్ అడ్వెంచర్స్ […]

కక్ష్య లోపలివరకూ.. అంతరిక్ష 'ఛేదన'లో స్పేస్ ఎక్స్.. అడ్వెంచర్స్ లో ముందడుగు
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 25, 2020 | 6:53 PM

Share

రోదసిలో అడ్వెంచర్స్ కు శ్రీకారం చుడుతోంది ఎలన్ మాస్క్ ఆద్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. ఇందులో భాగంగా నలుగురు టూరిస్టులను భూ కక్ష్యలోపలివరకూ.. ఇప్పటివరకూ ఏ వ్యోమగామి కూడా ఎంటర్ కాని  డీపర్ ఆర్బిట్ లోనికి వీరిని పంపనుంది. మరో రెండేళ్ల కల్లా.. 2022 నాటికి.. లాంచ్ కానున్న ఈ ప్రాజెక్టుకు 100 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే వ్యయమవుతుందని అంచనా. ఈ మిషన్ కు సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ వాషింగ్టన్ లోని స్పేస్ అడ్వెంచర్స్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. నిజానికి స్పేస్ అడ్వెంచర్స్.. రష్యన్ సోయుజ్ రాకెట్ల ద్వారా అంతర్జాతీయ స్పేస్  స్టేషన్ కి 8 మంది టూరిస్టులను పంపే యోచనలో ఉంది. వీరిలో మొదటి టూరిస్టు డెనిస్ టిటో. ఈ కేంద్రంలో ఎనిమిది గంటలు గడిపేందుకు 2001 లోనే ఈయన 20 మిలియన్ డాలర్లు చెల్లించాడట. ఇక లలిబెర్టే అనే వ్యక్తి 2009 లోనే తానూ ఇందుకు రెడీ అని ప్రకటించాడట. కొత్త టూరిస్టులు స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్ లో రోదసియానం చేయనున్నారు. నాసా వ్యోమగాములను తీసుకువెళ్లేందుకు ఈ రాకెట్ ను డెవలప్ చేశారు. స్పేస్ స్టేషన్ ఎత్తుకు రెండు నుంచి మూడు వంతుల ఎత్తుకు పైగా రీచ్ కావాలన్నదే తమ ధ్యేయమని స్పేస్ అడ్వెంచర్ ప్రెసిడెంట్ టామ్ షెల్లీ తెలిపారు.

భూఉపరితలానికి 400 కి. మీ. ఎత్తున అంతరిక్ష రోదసి కేంద్రం ఉందని భావిస్తున్నప్పటికీ.. తమ ఖఛ్చితమైన  ఆల్టిట్యుడ్ ని స్పేస్ ఎక్స్ సంస్థ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. వచ్ఛే ఏడాది, లేదా ఆ మరుసటి సంవత్సరం ఈ మిషన్ కి శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రానికి జరిపే వ్యోమయానానికి మాస్కోలో ఆరు నెలల శిక్షణ అవసరమయితే.. తాజా మిషన్ కు అమెరికాలో నాలుగు వారాల ట్రెయినింగ్ చాలునట.

Follow Us
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్