Melania School Visit: మెలనియా స్కూలు విజిట్… కేంద్రం అక్కసు.. కేజ్రీ, శిశోడియాల పేర్లు డ్రాప్..

అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్.. తన భర్త డొనాల్డ్ ట్రంప్ తో బాటు వచ్ఛేవారం ఇండియాను సందర్శిస్తున్న సంగతి విదితమే..ఈ విజిట్ సందర్భంగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో ఆమె కొంతసేపు గడపనున్నారు.

Melania School Visit: మెలనియా స్కూలు విజిట్... కేంద్రం అక్కసు.. కేజ్రీ, శిశోడియాల పేర్లు డ్రాప్..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Feb 22, 2020 | 5:01 PM

Melania School Visit:  అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్.. తన భర్త డొనాల్డ్ ట్రంప్ తో బాటు వచ్ఛేవారం ఇండియాను సందర్శిస్తున్న సంగతి విదితమే..ఈ విజిట్ సందర్భంగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో ఆమె కొంతసేపు గడపనున్నారు. అయితే ఆ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా హాజరు కాబోరట. వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఈ పాఠశాలను మెలనియా సందర్శించినప్పుడు ఆమెను కేజ్రీ, శిశోడియా ఇద్దరూ ఆహ్వానించవలసి ఉంది. కానీ..ఈ వీవీఐపీ ఈవెంట్ లో వీరు పాల్గొనకుండా కేంద్రం కావాలనే వీరి పేర్లను పక్కన బెట్టిందని ఆప్ ఆరోపిస్తోంది. నిజానికి పాఠశాల విద్యార్థుల్లో స్ట్రెస్ ను తగ్గించడానికి రెండేళ్ల క్రితమే మనీష్ శిశోడియా. స్కూళ్లలో .. . ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ పేరిట ఓ ప్రత్యేక సబ్జెక్టు వంటిదాన్ని ప్రవేశపెట్టారు. ఇది సుమారు 40 నిముషాల మెడిటేషన్, రిలాక్సింగ్, ఔట్ డోర్ యాక్టివిటీస్ వంటివాటితో కూడుకున్నది.ట్రంప్, మెలనియాల పర్యటన వల్ల ఆప్ పార్టీ రాజకీయంగా ప్రయోజనం పొందకుండా చూసేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలా ‘అక్కసు తీర్చుకుంటోందని విపక్షాలు మండిపడుతున్నాయి.