No Chance To Rohit Sharma: ఆ జట్టులో కోహ్లీ, ధావన్‌లకు చోటు.. రోహిత్‌కు నో ఛాన్స్..
బంగ్లాదేశ్ గడ్డపై వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య రెండు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు నలుగురు ఆటగాళ్లను పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు.
No Chance To Rohit Sharma: బంగ్లాదేశ్ గడ్డపై వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య రెండు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లను మార్చి 18, 21 తేదీలలో నిర్వహించనున్నారు. ఇక ఈ సిరీస్‌లో ఆసియా ఎలెవన్ తరపున భారత్ ఆటగాళ్లు కూడా ఆడనున్నారు. అందులో భాగంగానే టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లను పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లు ఆ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదని సమాచారం. కాగా, రోహిత్ శర్మ కాలి గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన సంగతి విదితమే. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు.