KTR Birthday: ప్రజానాయకుడు అంటూ రామ్‌చరణ్ బర్త్‌ డే విషెస్‌.. కేటీఆర్‌ రిప్లై ఏంటంటే

Ramcharan: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ ప్రజానేతకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. ఇక టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కేటీఆర్‌కు..

KTR Birthday: ప్రజానాయకుడు అంటూ రామ్‌చరణ్ బర్త్‌ డే విషెస్‌.. కేటీఆర్‌ రిప్లై ఏంటంటే
Ktr Birthday
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2022 | 2:42 PM

Ramcharan: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ ప్రజానేతకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. ఇక టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, రామ్‌గోపాల్‌ వర్మ, గోపీచంద్‌ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్‌, హరీశ్‌ శంకర్‌, అనసూయ, బండ్ల గణేశ్‌ తదితరులు మంత్రికి విషెస్‌ చెప్పిన వారిలో ఉన్నారు. ఇందుకు ప్రతిస్పందనగా కేటీఆర్‌ కూడా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో రామ్‌చరణ్‌ (Ramcharan) చేసిన కేటీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ చేసిన ఓ ట్వీట్‌, దానికి మంత్రి ఇచ్చిన రిప్లై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

త్వరలోనే నీ సినిమా చూస్తా..

ఇవి కూడా చదవండి

‘నా ప్రియమైన సోదరుడు, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు చెర్రీ. దీనికి స్పందించిన కేటీఆర్‌ ‘థ్యాంక్స్‌ బ్రదర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నీ నటన గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విన్నాను. త్వరలోనే ఆ సినిమాను తప్పకుండా చూస్తాను’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మెగా ఫ్యామిలీకి, కేటీఆర్‌కు మంచి సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ప్రోగ్రాములు, ఆడియో ఫంక్షన్లు, ప్రి రిలీజ్‌ ఈవెంట్లలో కేటీఆర్‌ ఎక్కువగా కనిపిస్తుంటారు. గతంలో చెర్రీ నటించిన ధ్రువ సినిమా ఆడియో ఫంక్షన్‌, పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు కేటీఆర్‌ చీఫ్‌ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..