RC 15: ఆ ప్రచారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు.. అసలు విషయం చెప్పిన ఆర్సీ15 మూవీ యూనిట్..

RC 15: సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అయ్యే సమాచారంలో నిజం ఎంత ఉంటుందో అదే స్థాయిలో ఫేక్‌ న్యూస్‌ కూడా ప్రచారం జరుగుతోంది. రాజకీయ నుంచి మొదలు సినిమాల వరకు..

RC 15: ఆ ప్రచారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు.. అసలు విషయం చెప్పిన ఆర్సీ15 మూవీ యూనిట్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 24, 2022 | 12:45 PM

RC 15: సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అయ్యే సమాచారంలో నిజం ఎంత ఉంటుందో అదే స్థాయిలో ఫేక్‌ న్యూస్‌ కూడా ప్రచారం జరుగుతోంది. రాజకీయ నుంచి మొదలు సినిమాల వరకు తప్పుడు సమాచార వ్యాప్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది సోషల్‌ మీడియా. ఈ క్రమంలోనే తాజాగా రామ్‌చరణ్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ‘ఆర్‌సీ 15’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి అంటూ పోస్ట్‌లు వెలిశాయి.

అయితే తాజాగా ఈ విషయం ఆర్సీ 15 చిత్ర యూనిట్‌కు తెలిసింది. దీంతో వెంటనే స్పందించి మూవీ యూనిట్ ఈ వార్తపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తి అవాస్థవమని.. తమ ప్రాజెక్ట్‌లో ఎవరినైనా నటీనటులుగా ఎంపిక చేసే బాధ్యత, అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిర్మాణ సంస్థ లేఖను విడుదల చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే శంకర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వాణీ నటిస్తోన్న విషయం తెలిసిందే. పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్‌ అవుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ ట్రిపుల్‌రోల్‌లో నటించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ