Divyansha Kaushik: నాగచైతన్య, రవితేజలో ఒక కామన్‌ క్వాలిటీ ఉంది.. దివ్యాంశా కౌశిక్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Divyansha Kaushik: మజిలీ (Majili) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార దివ్యాంశా కౌశిక్‌. ఈ సినిమాలో నాగ చైతన్య టీనేజ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రోల్‌లో నటించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే..

Divyansha Kaushik: నాగచైతన్య, రవితేజలో ఒక కామన్‌ క్వాలిటీ ఉంది.. దివ్యాంశా కౌశిక్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 24, 2022 | 9:04 AM

Divyansha Kaushik: మజిలీ (Majili) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార దివ్యాంశా కౌశిక్‌. ఈ సినిమాలో నాగ చైతన్య టీనేజ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రోల్‌లో నటించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక మజిలీ తర్వాత కరోనా రావడంతో దివ్యాంశా మరే సినిమాలో నటించలేదు. ఇక తాజాగా రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైందీ బ్యూటీ. 1995లో జరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను జులై 29న విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గరడపడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే దివ్యాంశా శనివారం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ. నాగచైతన్య, రవితేజాలతో పనిచేయడం రెండు భిన్న అనుభవాలను తెలిపిన దివ్యాంశా.. రవితేజ సెట్స్‌లో యాక్టివ్‌గా ఉంటే, నాగచైతన్య మాత్రం కామ్‌ అండ్‌ కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.

అయితే ఇద్దరిలో ఒక కామన్‌ క్వాలిటీ ఉంది, అదే.. సెట్స్‌లో సరదా ఫ్రాంక్స్ చేస్తుంటారని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక రామరావులో చేసిన నందిని పాత్రను చాలా ఎంజాయ్‌ చేశానని తెలిపిన దివ్యాంశా తన పాత్రకు ఎంతో స్కోప్‌ ఉందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..