Liger Movie: విడుదలకు ముందే మొదలైన లైగర్‌ రికార్డుల వేట.. డిజిటల్‌ హక్కులు ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Liger Movie: బాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు ఇప్పుడు లైగర్‌ (Liger) సినిమా గురించే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై...

Liger Movie: విడుదలకు ముందే మొదలైన లైగర్‌ రికార్డుల వేట.. డిజిటల్‌ హక్కులు ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Follow us

|

Updated on: Jul 24, 2022 | 9:34 AM

Liger Movie: బాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు ఇప్పుడు లైగర్‌ (Liger) సినిమా గురించే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో పాన్‌ ఇండియాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, బాలీవుడ్‌లోనూ మంచి బజ్‌ ఉంది. దీనికి కారణంగా కరణ్‌ జోహర్‌ వంటి అగ్ర నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడమే. ఈ చిత్రంలో విజయ్‌ సరసన, అనన్య పాండే నటిస్తుండగా, మైక్‌ టైసన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా అవుట్‌పుట్‌ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన సినిమా ట్రైలర్‌, పాటలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ముంబైలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎలా నిలిచాడన్నదే ఈ సినిమా కథాంశం. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా రికార్డుల వేట అప్పుడే మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. శాటిలైట్‌తో పాటు డిజిటల్ హక్కులను ఓ బడా సంస్థ సొంతం చేసుకోనుందని టాక్‌. ఇందుకోసం ఏకంగా రూ. 55 కోట్లు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. డిస్నీ+హాట్‌ స్టార్‌ డిజిటల్‌తో పాటు, శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకోనుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి విడుదలకు ముందే లైగర్‌ బిజినెస్‌ ఈ స్థాయిలో ఉంటే విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులు తిరిగిరాయడం ఖాయమని రౌడీ హీరో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..