అభిమానుల‌కి హీరో రామ్ స్పెష‌ల్ రిక్వెస్ట్‌..!

ఇటీవ‌లి కాలంలో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో వ‌చ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్ర‌జంట్ రామ్.. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో న‌టించాడు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల‌న ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసం అత‌డి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 15న రామ్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కి ప్ర‌త్యేక‌ సందేశాన్ని […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:48 pm, Tue, 12 May 20
అభిమానుల‌కి హీరో రామ్ స్పెష‌ల్ రిక్వెస్ట్‌..!

ఇటీవ‌లి కాలంలో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో వ‌చ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ప్ర‌జంట్ రామ్.. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రంలో న‌టించాడు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల‌న ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ సినిమా కోసం అత‌డి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 15న రామ్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కి ప్ర‌త్యేక‌ సందేశాన్ని పంపాడు.

ప్ర‌స్తుతం ఉన్న సంక్షోభ ప‌రిస్థితుల‌ దృష్ట్యా ఫ్యాన్స్.. అంద‌రూ త‌న‌ పుట్టిన రోజు వేడుక‌ల‌కి దూరంగా ఉండాల‌ని కోరాడు. అభిమానుల‌ ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇప్పుడు భౌతిక దూర‌మే అందరికీ శ్రేయ‌స్కర‌మ‌ని…ఈ ఒక్క‌సారి మీరు పాటించే దూర‌మే.. నాకు మీరిచ్చే అస‌లైన‌ కానుక అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి రామ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.