Hero Nani: నిత్యావసర సరుకులు పెరుగుతున్నా పట్టించుకోరు.. కానీ థియేటర్లపై ఆంక్షలు: హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Jul 27, 2021 | 11:13 PM

Hero Nani Comments: సినిమా థియేటర్లపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నాని.. థియేటర్ల విషయంలో ..

Hero Nani: నిత్యావసర సరుకులు పెరుగుతున్నా పట్టించుకోరు.. కానీ థియేటర్లపై ఆంక్షలు: హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!

Follow us on

Hero Nani Comments: సినిమా థియేటర్లపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నాని.. థియేటర్ల విషయంలో  చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమా అనేది మన కల్చర్‌.. థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూడటం అనేది మన బ్లడ్‌లోనే ఉంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని విమర్శించారు. సినిమా అంటేనే చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. రెస్టారెంట్లు, పబ్స్‌ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్‌ చాలా సేఫ్‌.. కానీ వాటినే ముందు మూస్తారు, లాస్ట్‌లో తెరుస్తారు అంటూ వ్యాఖ్యానించారు. నేను ఒక ప్రేక్షకుడి గా చెపుతున్నాను. మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఏది లేదు. థియేటర్ వ్యవస్థ మీద ఆధార పడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్న సినిమా తిమ్మరుసు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మి్స్తోన్న ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్‏ను నిన్న (జూలై 26న) యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని హాజరు అయ్యారు.

ఇవీ కూడా చదవండి

One Movie- Aha OTT: ‘ఆహ’లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్.. ‘వన్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Vijay – Chiranjeevi: విజయ్‌ దేవరకొండ వదులుకున్న చిత్రానికి చిరంజీవి ఓకే చెప్పాడా.? వైరల్‌గా మారిన ఆసక్తికర వార్త..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu