Tuck Jagadish: రిలీజ్ విషయంలో వీడని డైలామా.. టక్ జగదీశ్ మళ్లీ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడా ?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ ఒకటి.

Tuck Jagadish: రిలీజ్ విషయంలో వీడని డైలామా.. టక్ జగదీశ్ మళ్లీ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడా ?
Tuck Jagadish
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2021 | 9:13 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ ఒకటి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే కోవిడ్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల విడుదలైన నారప్ప సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకోవడంతో తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల థియేటర్లలలో విడుదలైన తిమ్మరుసు పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా.. జనాలు మాత్రం అంతంతగానే వీక్షించినట్లుగా తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గినా.. థియేటర్లలో జనాలు సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిర్మాతలలో సరికొత్త సందేహం మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితులలో తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తే.. మూవీ బడ్జెట్ అయినా వస్తుందా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో నిర్మాతలు సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే పలువురు హీరోలు మాత్రం సినిమాలు ఓటీటీలో విడుదల చేయవద్దని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక నాని నటించిన టక్ జగదీష్ సినిమాను కూడా మొదట థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మూవీని థియేటర్లలో కంటే ఓటీటీలోనే విడుదల చేయడం మంచిదని భావిస్తున్నారట మేకర్స్. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ చిత్రానికి రూ. 45 కోట్లను చెల్లించేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. దీంతో చివరకు టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్‏లో రిలీజ్ కాబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. రీతు వర్మ, ఐశ్యర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? ‘గని’ మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులను ఆశ్రయించిన అపార్ట్‏మెంట్ వాసులు..