Nani: అప్పుడు ‘జెర్సీ’.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’.. ఫ్యాన్స్‌కు మరో ఎమోషనల్ రైడ్ గ్యారంటీ.!

ఓ ఊర మాస్ సినిమా చేసిన తర్వాత.. మరో మాస్ సినిమా చేసి మార్కెట్ మరింత పెంచుకోవాలనుకునే హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారు. కానీ అందులో..

Nani: అప్పుడు 'జెర్సీ'.. ఇప్పుడు 'హాయ్ నాన్న'.. ఫ్యాన్స్‌కు మరో ఎమోషనల్ రైడ్ గ్యారంటీ.!
Nani 30
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ravi Kiran

Updated on: Jul 14, 2023 | 8:30 AM

ఓ ఊర మాస్ సినిమా చేసిన తర్వాత.. మరో మాస్ సినిమా చేసి మార్కెట్ మరింత పెంచుకోవాలనుకునే హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారు. కానీ అందులో తాను లేనంటున్నారు నాని. ఏం చేసినా కొత్తగా చేద్దామనే రకం ఈయన. అందుకే నెవర్ బోరింగ్ నాన్న కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నారు నాని. ఈయన కొత్త సినిమా టీజర్ విడుదలైంది. మరి అది ఎలా ఉంది..? ఈ కాన్సెప్ట్‌తో మరో హిట్ ఇస్తారా..?

నాని కెరీర్‌లో ఎన్ని గొప్ప సినిమాలైనా ఉండొచ్చు కానీ జెర్సీకి మాత్రం సపరేట్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. కల్ట్ క్లాసిక్ అంటారు కదా.. అలాంటి జాబితాలోకి వచ్చే సినిమా జెర్సీ. సక్సెస్ స్టోరీస్ ఎవరైనా తీస్తారు.. కానీ ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ ఫుల్‌గా ఈ సినిమాలో చూపించారు గౌతమ్ తిన్ననూరి. పైగా తండ్రీ కొడుకుల సెంటిమెంట్ జెర్సీకి బలం. చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ అలాంటి నాన్న కాన్సెప్ట్‌తో వస్తున్నారు నాని.

కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమాకు హాయ్ నాన్న టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌ కాగా.. శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో నానిని మృణాళ్ నాన్న అని పిలిచారు.. అంటే పాప తల్లి మృణాళ్ కాదు.. ఈ ముగ్గురి మధ్య ఉన్న రిలేషనే కథ అని రివీల్ చేసారు మేకర్స్. 2017లో MCA విడుదలైన డిసెంబర్ 21నే ఇప్పుడు హాయ్ నాన్నను ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

దసరా ఊర మాస్ సినిమా తర్వాత.. ఇమేజ్ చట్రంలో పడిపోకుండా మేకోవర్ అవుతున్నారు నాని. జెర్సీలో పదేళ్ల కుర్రాడికి తండ్రిగా నటించి కన్నీళ్లు పెట్టించిన నాని.. మరోసారి అదే చేయాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి చూడాలిక.. జెర్సీలాగే.. హాయ్ నాన్నతో నాని మరో క్లాసిక్ ఇస్తారో లేదో..?

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా