Roshan: ‘నో టాలీవుడ్.. ఓన్లీ ప్యాన్ ఇండియా’.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేసిన శ్రీకాంత్ తనయుడు..

పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఓ సినిమా రిలీజ్ చేసారు.. 10 సినిమాలు లైన్‌లో పెట్టారు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాగే దర్శకురాలు గౌరీ కూడా మరో సినిమాకు..

Roshan: 'నో టాలీవుడ్.. ఓన్లీ ప్యాన్ ఇండియా'.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేసిన శ్రీకాంత్ తనయుడు..
Roshan
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ravi Kiran

Updated on: Jul 14, 2023 | 8:30 AM

పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఓ సినిమా రిలీజ్ చేసారు.. 10 సినిమాలు లైన్‌లో పెట్టారు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాగే దర్శకురాలు గౌరీ కూడా మరో సినిమాకు సైన్ చేసారు. కానీ హీరో రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు.. కనీసం నెక్ట్స్ సినిమా అప్‌డేట్ కూడా లేదు. అసలు ఈ కుర్ర హీరో ఏం చేస్తున్నారు..? ప్యాన్ ఇండియాను తప్ప.. టాలీవుడ్‌పై రోషన్ ఫోకస్ చేయట్లేదా..?

కొందరు హీరోలకు మొదటి సినిమా గుర్తింపు తీసుకురాకపోయినా.. రెండో సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. అలా క్రేజ్ తెచ్చుకున్న హీరో రోషన్. అప్పుడెప్పుడో స్కూల్ ఏజ్‌లోనే నిర్మల కాన్వెంట్‌తో హీరోగా పరిచయమైన ఈయన.. 2021లో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడితో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.

పెళ్లి సందడిలో రోషన్ మేకోవర్ ప్లస్ లుక్స్‌కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. మనోడు చూడ్డానికి టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా ఉన్నాడే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా వచ్చి రెండేళ్లైనా ఇంకా మరో సినిమా చేయలేదు. ఆ మధ్య ప్రదీప్ అద్వైతంతో ఓ పీరియాడికల్ సినిమాకు సైన్ చేసారు.. వైజయంతి మూవీస్‌లో ఈ సినిమా వస్తున్నా.. ఇప్పటివరకైతే ఎలాంటి అప్‌డేట్ లేదు.

తెలుగు కంటే పాన్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రోషన్. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. తాజాగా పాన్ ఇండియన్ సినిమా వృషభలో నటించే ఛాన్స్ వచ్చింది రోషన్‌కు. ఇందులో మోహన్ లాల్ కొడుకుగా నటించనున్నారీయన. దాదాపు 150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందకిషోర్ దర్శకుడు. మొత్తానికి ఓన్లీ ప్యాన్ ఇండియా.. నో టాలీవుడ్ అంటున్నారు శ్రీకాంత్ తనయుడు.