Nandamuri TarakaRatna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. శివరాత్రి రోజే శివైక్యం
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
నందమూరి తారకరత్న కన్నుమూశారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
ఇక విదేశీ డాక్టర్లతో చికిత్సను అందించారు కుటుంబసభ్యులు.. అయినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు. 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఈ రోజు (శనివారం 18న )తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
తారకరత్న మరణ వార్తతో సినీలోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.