Hanuman: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్’ .. అయోధ్య రామమందిరానికి రూ.14 లక్షల విరాళం అందజేత
జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్‌గా మెప్పించాడు. రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సముద్ర ఖని, గెటప్ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో రిలీజ్‌కు ఒక్క రోజు ముందే అంటే జనవరి 11న తేదీన ప్రీమియర్ షోలు వేశారు

హనుమాన్ టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ మూవీ కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చింది. ఇప్పటివరకు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 14.25 లక్షలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు విరాళంగా అందించారు. అంతకు ముందు హనుమాన్ టీమ్ చిత్ర బృందం ఫిల్మ్ నగర్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది హనుమాన్ టీమ్ యూనిట్. ఇక జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్‌గా మెప్పించాడు. రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సముద్ర ఖని, గెటప్ శీను, సత్య, రోహిణీ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో రిలీజ్‌కు ఒక్క రోజు ముందే అంటే జనవరి 11న తేదీన ప్రీమియర్ షోలు వేశారు. సుమారు 300 థియేటర్లలో హనుమాన్ సినిమాను ప్రదర్శించారు.
హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తామని ప్రకటించింది. ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. అలా ఇచ్చిన మాట ప్రకారమే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 14.25 లక్షలను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు విరాళంగా పంపించారు. హనుమాన్ మూవీ ప్రదర్శితమైనన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్‌పై 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా వెళ్లనుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
A Promise was made and it is kept ❤️🔥
Team #HANUMAN offered a Grand Cheque to Ayodhya Ram Mandir per ₹5 on every ticket sold till now 🤗
A website launch is also announced to track the amount that will be donated till the Blockbuster full run of HanuMan 😍
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024
హనుమాన్ ఆలయంలో చిత్ర బృందం..
Team #HANUMAN gathers for the ‘Blockbuster Success Meet’ at Film Nagar Hanuman Temple, HYD 😍
Here are some snaps of them seeking blessings from Lord Hanuman & sharing their joy of success ❤️📸
A @PrasanthVarma Film 🌟ing @tejasajja123… pic.twitter.com/FvtVpMA27d
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








