GV Prakash Kumar: ‘మీరు రియల్ హీరో బ్రో’.. ఏడాది చిన్నారి ఆపరేషన్ కోసం హీరో ఆర్థిక సాయం.. ఫ్యాన్స్ కూడా..
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ హీరోకు సామాజిక స్కృహ ఎక్కవే. ప్రొఫెషనల్ వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, సమస్యలపై గొంతు విప్పి మాట్లాడుతుంటాడు. అలాగే ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తుంటాడు.

సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జీవీ ప్రకాశ్ కుమార్. 25 ఏళ్లకే 25 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డును అందుకున్నాడు. తెలుగులోనూ జీవీ పాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్ సినిమాతో తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడీ మ్యూజిక్ స్టార్. కేవలం మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్‌గా, కంపోజర్‌గా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటాడు జీవీ. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ హీరోకు సామాజిక స్కృహ ఎక్కవే. ప్రొఫెషనల్ వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, సమస్యలపై గొంతు విప్పి మాట్లాడుతుంటాడు. అలాగే ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తుంటాడు. గతంలోనూ ఇది చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోన్న ఏడాది చిన్నారి ఆపరేషన్ కోసం తన వంతు ఆర్థిక సహాయం అందజేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఒక యువకుడు తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏడాది బిడ్డ ఇబ్బంది పడుతుందని వెంటనే శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఆర్థిక సహాయం కోరుతూ పోస్ట్ షేర్ చేశాడు. ‘ఆన్‌లైన్‌లో ఇలా ఆర్థిక సాయం అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఒక బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు తప్పడం లేదు. నా సోదరి బిడ్డ (ఒక ఏడాది వయసు) మెదడు వైపు కణితి ఉందని డాక్టర్లు చెప్పారు. చికిత్స కోసం మధురై అపోలో ఆస్పత్రికి బాబుకు తీసుకెళ్లాను. అక్కడ వైద్యులు పరీక్షించి వెంటనే సర్జరీ చేయాలన్నారు. ఇందుకు రూ. 3.5 లక్షల నుంచి 4 లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. మా కుటుంబం నుంచి సుమారు 2 లక్షల రూపాయల వరకు సిద్ధం చేశాను. మీరు నాకు కొంత సాయమందిస్తే.. నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మీకు తోచినంత సాయం చేయండి ఫ్రెండ్స్’ అని సదరు యువకుడు అభ్యర్థించాడు.
బాబును బతికించుకునేందుకు..
A small help from my side best of luck pic.twitter.com/N42eUcHvOm
— G.V.Prakash Kumar (@gvprakash) November 24, 2023
మేం కూడా సాయం చేస్తాం బ్రో..
ఈ పోస్టును చూసిన హీరో జీవీ ప్రకాశ్ కుమార్ వెంటనే స్పందించాడు. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం తన వంతు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందజేశాడు. ‘నా నుంచి ఇది చిరు సాయం. మీకు అంతా మంచే జరగాలి’ అని యువకుడికి సందేశం పంపాడు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది . ‘మీరు రియల్ హీరో బ్రో’ అంటూ పలువురు అభిమానులు, నెటిజన్లు జీవీని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఆ చిన్నారి ఆపరేషన్‌కు మరికొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




