Ram Charan: ‘రామ్ చరణ్ నిజమైన భక్తుడు’.. అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి వెళ్లడంపై రాధా మనోహర్ దాస్ ఏమన్నారంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే అయ్యప్ప మాలను ధరించిన సమయంలో కడప దర్గాను దర్శించడంపై కొందరు రామ్ చరణ్ ను తప్పుపడుతున్నారు.

Ram Charan: 'రామ్ చరణ్ నిజమైన భక్తుడు'.. అయ్యప్ప దీక్షలో కడప దర్గాకి వెళ్లడంపై రాధా మనోహర్ దాస్ ఏమన్నారంటే?
Guru Radha Manohar Das, Ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 5:12 PM

సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే మెగా హీరో రామ్ చరణ్ ఇటీవల కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే దర్గాకు సమీపంలో ఉన్న విజయ దుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తదుపరి సినిమా స్క్రిప్టును అమ్మవారి పాదాల దగ్గర ఉంచి దీవెనలు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అయ్యప్ప స్వామి మాలలో ఉంటోన్న రామ్ చరణ్ కడప దర్గాను దర్శించుకోవడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా హీరో వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ పై వస్తోన్న విమర్శలకు ఇప్పటికే అతని సతీమణి ఉపాసన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఈ విషయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ రాధా మనోహర్ దాస్ రామ్ చరణ్ కు అండగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

‘ రామ్ చరణ్ నిజమైన భక్తుడు. శివాలయాన్ని శుభ్రం చేసాడు‌‌. తన కూతురికి కూడా క్లీంకార అనే పేరు పెట్టాడు. ఆర్ ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌ కోసం విదేశాలకు వెళ్లినపుడు వెంట రాముల వారిని కూడా తీసుకెళ్లాడు. మీలో ఎవరికైనా రామ్ చరణ్ తప్పు చేసినట్లు అనిపిస్తే నా దగ్గరికి రండి.. తీరిగ్గా కూర్చొని మాట్లాడుదాం. ఎవరో పిలిచారని అతను దర్గాకు వెళ్లాడు. అతనికి తెలియకపోతే మనం చెప్పాలి అంతే కానీ చరణ్ గురించి తప్పుగా ప్రచారం చేయవద్దు’ అని సూచించారు.

రామ్ చరణ్ గురించి స్వామీజీ మాటల్లో..

ఇందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మెగాభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిమాన నటుడికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఉపాసన పోస్ట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.