AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shree Hanuman Chalisa : 14 ఏళ్ల క్రితం రిలీజ్.. 5 బిలియన్ల వ్యూస్.. యూట్యూబ్‏లో ఎక్కువసార్లు చూసిన సాంగ్ ఇదే..

యూట్యూబ్‏లో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అడియన్స్ ముందుకు వస్తుంది. అలాగే ఎన్నో రకాల వీడియోలకు అత్యధిక వ్యూస్ వస్తూ ట్రెండ్ అవుతుంటాయి. కానీ మీకు తెలుసా.. ? దాదాపు 14 ఏళ్ల క్రితం విడుదలైన ఓ సాంగ్ ఇప్పటికీ సంచలనం సృష్టిస్తుంది. 5 బిలియన్ల వ్యూస్ తో ఇప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Shree Hanuman Chalisa : 14 ఏళ్ల క్రితం రిలీజ్.. 5 బిలియన్ల వ్యూస్.. యూట్యూబ్‏లో ఎక్కువసార్లు చూసిన సాంగ్ ఇదే..
Song (1)
Rajitha Chanti
|

Updated on: Nov 26, 2025 | 11:40 AM

Share

యూట్యూబ్‏లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వీడియోస్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కామెడీ వీడియోస్ సైతం సత్తా చాటుతున్నాయి. కానీ ఒక సాంగ్ దాదాపు 14 ఏళ్ల క్రితం విడుదలై ఇప్పటికీ సెన్సేషన్ అవుతుంది. భారతదేశం నుంచి వచ్చిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‏లో 5 బిలియన్ వ్యూస్ దాటిన ఏకైక వీడియోగా అవతరించింది. ఇప్పటివరకు చాలా వీడియోస్ కేవలం 2 బిలియన్ కంటే తక్కువ వ్యూస్ తో ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న సాంగ్ వీడియో ఏంటో తెలుసా..? అదే శ్రీ హనుమాన్ చాలీసా. టి-సిరీస్‌కు చెందిన దివంగత గుల్షన్ కుమార్ నటించిన ‘శ్రీ హనుమాన్ చాలీసా’ వీడియో మే 10, 2011న విడుదలైంది.

14 ఏళ్ల క్రితం విడుదలైన 5 బిలియన్ వ్యూస్ పెరిగింది. హరిహరన్ గానం, లలిత్ సేన్ కూర్పుతో రూపొందించిన ఈ పాట .. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. ఈ విషయంపై టీ..సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. “హనుమాన్ చాలీసా నాతో సహా లక్షలాది మంది హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నా తండ్రి శ్రీ గుల్షన్ కుమార్ జీ ప్రతి ఇంటికి ఆధ్యాత్మిక సంగీతాన్ని తీసుకెళ్లడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇది ఆయన దార్శనికతకు ప్రతిబింబం. 5 బిలియన్ వ్యూస్ దాటడం.. యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్ రాబట్టిన 10 వీడియోలలో ఒకటిగా నిలవడం అనేది కేవలం డిజిటల్ విజయం కాదు.. ఇది దేశ ప్రజల అచంచలమైన భక్తిని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

శ్రీ హనుమాన్ చాలీసా’ సాధించిన సంఖ్యలకు దగ్గరగా ఏ భారతీయ విడుదల కూడా లేదు. ఈ సాంగ్ తర్వాత అత్యధిక వ్యూస్ వచ్చిన పాటగా పంజాబీ ట్రాక్ ‘లెహెంగా’ 1.8 బిలియన్ వ్యూస్‌తో ఉంది. అలాగే హర్యాన్వి పాట 52 గజ్ కా డమన్ కు 1.7 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. తమిళ పాట ‘రౌడీ బేబీ’ ఒక్కొక్కటి 1.7 బిలియన్ వ్యూస్‌తో తర్వాతి స్థానంలో ఉన్నాయి. టాప్ బ్రాకెట్‌లో ఉన్న ఇతర ప్రసిద్ధ భారతీయ వీడియోలలో ‘జరూరి థా’, ‘వాస్తే’, ‘లాంగ్ లాచి’, ‘లుట్ గయే’, ‘దిల్‌బార్’ , ‘బమ్ బమ్ బోలే’ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ‘బేబీ షార్క్ డాన్స్’ (16.38 బిలియన్ వ్యూస్), ‘డెస్పాసిటో’ (8.85 బిలియన్), ‘వీల్స్ ఆన్ ది బస్’ (8.16 బిలియన్), ‘బాత్ సాంగ్’ (7.28 బిలియన్) ‘జానీ జానీ యస్ పాపా’ (7.12 బిలియన్) వంటి వీడియోలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..