Bigg Boss 9 Telugu: మాట నిలబెట్టుకోలేకపోయా.. కూతురి కోసం భరణి ఎమోషనల్.. కెప్టెన్సీ టాస్కులో ఓటమి..
బిగ్‌బాస్ సీజన్ 9.. మరో మూడు వారాల్లో ముగియనుంది. దీంతో ఇప్పుడు కేవలం ఈ ఒక్క వారం మాత్రమే కెప్టెన్సీ ఉండిపోతుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో భరణి మినహా అందరూ కెప్టెన్ అయినవాళ్లే. దీంతో చివరి అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకుని కెప్టెన్ కావాలని భరణి ఎక్కువగానే ట్రై చేశాడు. కానీ ఈవారం భరణి కల చెదిరిపోయింది.

బిగ్‌బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ షో ముగియనుంది. మరోవైపు ఈ వారం మాత్రమే కెప్టెన్సీ ఉండబోతుంది. ప్రస్తుతం హౌస్ లో భరణి మినహా.. అందరూ ఒక్కసారైనా కెప్టెన్ అయినవాళ్లే.. దీంతో చివరి అవకాశాన్ని ఉపయోగించుకుని కెప్టెన్ అవ్వాలని భరణి ఈసారి గట్టిగానే ట్రై చేశాడు. గతవారం ఫ్యామిలీ వీక్ లో వచ్చిన తన చిన్న కూతురు సైతం నాన్న ఎలగైనా కెప్టెన్ కావాలని అడిగింది. దీంతో ట్రై చేస్తానంటూ మాటిచ్చాడు భరణి. కానీ ఇప్పుడు అతడి కెప్టెన్సీ కల సైతం చెదిరిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ముందుగా ప్రియాంక జైన్ హౌస్ లోకి రాగా.. ఆమె ఎవరితో టాస్క్ ఆడాలనేది నిర్ణయించుకోవాలని సూచించాడు బిగ్‌బాస్. దీంతో అందరినీ అడిగి కళ్యాణ్ ను ఎంపిక చేసుకుంది. ప్రియాంక, కళ్యాణ్ మధ్య సమ్ థింగ్ ఫిషీ అనే టాస్కు జరగ్గా.. ఇందులో కళ్యాణ్ గెలిచాడు. దీంతో ఈ వారం మొదటి కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ పంచెకట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తనతో పోటీపడేందుకు భరణిని ఎంపిక చేసుకున్నారు.
త్వరగా.. సరిగా అనే టాస్కులో గౌతమ్, భరణి పోటీ పడ్డారు. ఈ టాస్కులో గౌతమ్ గెలవడంతో కెప్టెన్సీ రేసు నుంచి భరణి తప్పుకోవాల్సి వచ్చింది. ఓడిపోయిన తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. కూతురు చెప్పిన మాటలను గుర్తుంచేసుకుంటూ బాధపడ్డాడు భరణి. ఎలాగైనా కెప్టెన్ అవ్వండి డాడీ అన్నది మైండ్ లో ఉంది కానీ.. మొన్న మిస్ అయినప్పుడే చివరకు వచ్చి పోయిందే అని బాధపడ్డా.. ఇది రాసి లేదు.. సారీ హానీ పాప.. సారీ అమ్మా అంటూ భరణి ఎమోషనల్ అయ్యాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
