Tollywood:NCC డ్రెస్‌లోని ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ హీరో.. ఊహకందని కాన్సెప్టులతో సినిమాలు.. గుర్తు పట్టారా?

'నలుగురికి నచ్చినది.. నాకసలే అది నచ్చదులే' అని ఓ సినిమాలో మహేశ్ బాబు పాట అందుకుంటాడు. ఆ మాటలు సరిగ్గా ఈ హీరో కమ్ డైరెక్టర్ కు సరిపోతాయి. ఎవరి ఊహకు అందని కాన్సెప్టులు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు తీయడం, నటించడంలో ఈ స్టార్ హీరో దిట్ట. ఎంతలా అంటే ఆయన, ఆయన తీసే సినిమాలకు సౌతిండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు.

Tollywood:NCC డ్రెస్‌లోని ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ హీరో.. ఊహకందని కాన్సెప్టులతో సినిమాలు.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2024 | 6:41 PM

‘నలుగురికి నచ్చినది.. నాకసలే అది నచ్చదులే’ అని ఓ సినిమాలో మహేశ్ బాబు పాట అందుకుంటాడు. ఆ మాటలు సరిగ్గా ఈ హీరో కమ్ డైరెక్టర్ కు సరిపోతాయి. ఎవరి ఊహకు అందని కాన్సెప్టులు, సరికొత్త సబ్జెక్టులతో సినిమాలు తీయడం, నటించడంలో ఈ స్టార్ హీరో దిట్ట. ఎంతలా అంటే ఆయన, ఆయన తీసే సినిమాలకు సౌతిండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా పంథా మాత్రం మార్చుకోలేదు. సరికదా.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తనే డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకీ ఆయనెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆ కుర్రాడు మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర అలియాస్ ఉప్పీ. గతంలో ఆయన నటించిన క్లాసిక్ సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా రిలీజవుతున్నాయి. ఇటీవలే ఉపేంద్ర సినిమా థియేటర్లలో మళ్లీ రీ రిలీజైంది. ఇప్పుడు ఉపేంద్ర నటించిన మరో క్లాసిక్ సినిమా ‘A’ జూన్ 21న థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది.

కాగా గతంలో తాను నటించిన పలు సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు ఉపేంద్ర. ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడీ వర్సటైల్ యాక్టర్. యూఐ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్’ అని ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ అభిమానులను ఊహించని థ్రిల్ కు గురి చేసింది. ముఖ్యంగా టీజర్ లోని స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సుమారు రూ.100 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

యూఐ సినిమాలో ఉపేంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..