AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరో.. ఎవరో తెల్సా..?

తెలుగులో అప్పట్లో చాలామంది కమెడియన్లు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో లక్ష్మీపతి కూడా ఒకరు. కితకితలు సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. బాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఆయన తనయుడు హీరో అని మీకు తెల్సా...

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హీరో.. ఎవరో తెల్సా..?
Comedian Lakshmipathi
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2024 | 7:11 PM

Share

తెలుగు ఇండస్ట్రీని కమెడియన్లు ఫ్యాక్టరీ అంటారు. మన దగ్గర ఆ స్థాయిలో కమెడియన్లు క్రియేట్ చేశారు మేకర్స్. ఆర్టిస్టులు కూడా విభిన్నమైన భాష, యాస, బాడీ లాంగ్వేజ్‌, టైమింగ్స్‌తో ఆడియెన్స్ మనసుల్ని గెలుచుకున్నారు. టాలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్లో లక్ష్మీపతి కూడా ఒకరు.  తనదైన శైలి మాటకారితనంతో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు ఈ దివంగత నటుడు. లేటు వయస్సులో ఇండస్ట్రీకి అడుగుపెట్టినా తన మర్క్ వేసేశారు. ఆయన, సునీల్‌ కాంబినేషన్‌లో చేసిన కామెడీ సీన్స్‌ చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు.  అయితే లక్ష్మీపతి  తొలుత రచయితగా కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చంద్రలేఖ సినిమాకు రచనా సహకారం అందించారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఆయన బ్రేక్ వచ్చింది మాత్రం ఈవీవీ తీసిన ‘అల్లరి’ సినిమాతోనే.

కాగా లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా తమ్ముడు అవుతాడు.  మహేశ్‌బాబు ‘బాబీ’, ప్రభాస్‌ ‘వర్షం’ సినిమాలకు శోభన్ దర్శకత్వం వహించారు. కాగా 2008లో శోభన్ అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆయన చనిపోయిన నెల రోజుల్లోనే కుంగుబాటుకు గురై లక్ష్మీపతి కూడా మరణించారు.

శోభన్ కొడుకులు ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ 2011లో గోల్కొండ హైస్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. 2018లో పేపర్ బాయ్ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ఏక్ మినీ కథ,  ‘అన్నీ మంచి శకునములే’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా రాణిస్తున్నారు. మ్యాడ్ సినిమాలో ఒక హీరోగా నటించాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..