Gangs of Godavari OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఎక్కడ చూడొచ్చంటే?

టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నట విశ్వ రూపానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమా ఆడుతోంది. అయితే థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.

Gangs of Godavari OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఎక్కడ చూడొచ్చంటే?
Gangs Of Godavari Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2024 | 5:59 PM

గామి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నట విశ్వ రూపానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమా ఆడుతోంది. అయితే థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 14) నుంచే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఇది వరకే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే విశ్వక్ సేన్ యాక్షన్ డ్రామా షురూ కానుందన్న మాట.

కాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను నిర్మించారు. హైపర్ ఆది, నాజర్, మధు నందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృథ్వీ రాజ్, అయేషా ఖాన్ (స్పెషల్ సాంగ్) తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను మిస్ అయ్యారా? యాక్షన్ సినిమాలు చూసే వారికి వీకెండ్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..