Tollywood: ఉంగరాల ముంగురులు.. ఒక్క సినిమాతోనే స్టన్ అయ్యే ఫాలోయింగ్.. ఈమె ఎవరో గుర్తుపట్టండి..
గత రెండ్రోజుల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ సముద్ర తీరాన అలల తాకిడిని ఆస్వాదిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. తాజాగా మరో ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఉంగరాల ముంగురులున్న చిన్నది ఎవరో గుర్తుపట్టండి.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం ఎంతగా వ్యాపించిందో చెప్పక్కర్లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్స్.. గంటలు గంటలు నెట్టింట మునిగితేలుతున్నారు జనాలు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా ఇంటర్నెట్ ప్రపంచానికి అడిక్ట్ అయిపోయారు. వ్యక్తిగత విషయాలు.. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెటిజన్సతో పంచుకుంటుంటారు. అంతేకాదు.. ఇంట్లో ఏం చేస్తున్నారు ? ఖాళీ సమయంలో ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నారు ? వెకేషన్స్ ఎక్కడికెళ్తున్నారు ? ఇలా ఒక్కటేమిటీ అన్ని విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తమ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇక కొద్దిరోజులుగా టాలీవుడ్ ముద్దుగుమ్మలు విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండ్రోజుల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ సముద్ర తీరాన అలల తాకిడిని ఆస్వాదిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. తాజాగా మరో ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ఉంగరాల ముంగురులున్న చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఒక్క సినిమాతోనే స్టన్ అయ్యే ఫాలోయింగ్ సంపాదించుకుంది. నటన పరంగానూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.
తను మరెవరో కాదు.. హీరోయిన్ మిథిలా పాల్కర్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈముద్దుగుమ్మ. ఈ మూవీతో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవడమే కాకుండా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే ఈ అమ్మడుని అభిమానులు పొట్టి నూడుల్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. మిథిలా పాల్కర్ పుట్టిన రోజు నేడు.
1993 జనవరి 11న ముంభైలో జన్మించింది మిథిలా పాల్కర్. ఆమె 2014లో మరాఠీలో హనీమూన్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆ తర్వాత హిందీలో కట్టి బట్టి సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మిథిలా.. ఓరి దేవుడా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగులో మరిన్ని చిత్రాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.