Megastar Chiranjeevi:  రోజా వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. మంత్రి అయ్యాక కూడా తమ ఇంటికి వచ్చారంటూ..

మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఆమె మాటలపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించానని.. తనతోపాటు సెంటిమెంట్ కూడా పంచుకున్నానని అన్నారు. బ్లాడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తోపాటు.. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం ఇవన్ని తన హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానాలు

Megastar Chiranjeevi:  రోజా వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. మంత్రి అయ్యాక కూడా తమ ఇంటికి వచ్చారంటూ..
Megastar Chiranjeevi, Roja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2023 | 6:18 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న చిరు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాటలపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించానని.. తనతోపాటు సెంటిమెంట్ కూడా పంచుకున్నానని అన్నారు. బ్లాడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తోపాటు.. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం ఇవన్ని తన హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానాలు అని.. ఆమె అన్న మాటలకు తను ఆన్సర్ ఇస్తే తన స్థాయిని తగ్గించుకున్నవాడిని అవుతానని అన్నారు.

ఆమె మంత్రి అయ్యాక కూడా తన ఇంటికి వచ్చారని.. అక్కడే భోజనం కూడా చేశారని.. ఎప్పుడూ సొంత మనుషుల్లా తిరిగారని అన్నారు. వాళ్ల మెంటాలిటీ.. నైజాం ప్రకారం మాట్లాడేస్తే.. నేను స్పందించి మాట్లాడడం నా నైజం కాదని.. వాళ్లు ఏం మాట్లాడినా వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. చిరు మాట్లాడుతూ.. “తను ఎన్నోసార్లు అక్కా.. అక్కా అని సార్.. సార్ అని మా ఇంట్లో భోజనం చేశారు. నేను కూడా ఆత్మీయంగా.. మనస్పూర్తిగా ఆహ్వానించాను. సెంటిమెంట్.. ప్రేమ, వాత్సాల్యానికి విలువనిచ్చే మనిషిని నేను. వాళ్లు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేసి వాళ్లను తగ్గించి.. నా సెంటిమంట్.. నేను ఇచ్చే విలువను పటాపంచలు చేసుకోను. అలా మాట్లాడడం వాళ్ల నైజం.

ప్రేక్షకుల మాపై చూపించే ప్రేమలకు.. చూపించిన వాత్సాల్యానికి విలువ లేదా ?.. ఇంతేనా ప్రపంచం. కొన్నిసార్లు వాళ్లను చూస్తే రాజకీయం అంటే ఇలానే ఉండాలా ? వేరే విధంగా ఉండకూడదా ? అని అనిపిస్తుంది. నేను గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదు. అది నా నైజం” అంటూ చెప్పుకొచ్చారు చిరు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.