Prashanth Neel: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన ‘సలార్ డైరెక్టర్’.. ప్రశాంత్ నీల్ ట్విట్టర్ డెలీట్.. షాక్‌లో ఫ్యాన్స్..
ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ చిత్రం సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇటీవల గతేడాది కేజీఎఫ్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని ఇందుకుంది. అంతేకాదు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ స్తాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా..హీరో యశ్‌కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. అతనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన రూపొందించిన కేజీఎఫ్ చిత్రం సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇటీవల గతేడాది కేజీఎఫ్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ మూవీతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ టైటిల్‌తో రాబోతున్న వీరి కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మరింత హైప్ తీసుకువచ్చాయి. అయితే సలార్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షాకిచ్చారు.
ప్రస్తుతం సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ ఖాతాను డెలిట్ చేసి అందరికి షాకిచ్చారు. రీసెంట్ గా కేజీఎఫ్ హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్ప్పుడు ఉన్నట్టుండి ట్విట్టర్ డెలీట్ చేశారు. దీంతో ఇందుకు కారణాలపై ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అయితే ఆయన ట్విట్టర్ డీయాక్టివేట్ చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకటి సలార్ చిత్రాన్ని పూర్తిచేసేందుకు తన ఫుల్ ఫోకస్ అంత సినిమాపై పెట్టాలని.. అలాగే.. కొన్నాళ్లు నెట్టింటికి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే కాకుండా.. ఇటీవల యశ్ బర్త్ డే విషెస్ ఆయన ఉర్దూలో పెట్టాడు. దీంతో ఆయనను నెటిజన్స్ ట్రోల్ చేశారు. దీంతో ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతాను డెలీట్ చేసాడని అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే తన ట్విట్టర్ ఖాతా డెలీట్ చేసేముందు ప్రశాంత్ నీల్ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఆకస్మాత్తుగా డియాక్టివేట్ చేసి నెటిజన్లకు షాకిట్టాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.