AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చీరకట్టులో అందాల జాబిలమ్మ ఆమె.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ.. ఫోటోలో ఉన్న హీరోయిన్‏ను గుర్తుపట్టారా ?..

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. చీరకట్టులో సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉందండి. ఆమెకు ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది.

Tollywood: చీరకట్టులో అందాల జాబిలమ్మ ఆమె.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ముద్దుగుమ్మ.. ఫోటోలో ఉన్న హీరోయిన్‏ను గుర్తుపట్టారా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2023 | 11:13 AM

Share

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో అమ్మాడి క్రేజ్ మారిపోయింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. చీరకట్టులో సంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉందండి. ఆమెకు ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పడిప్పుడే రీఎంట్రీకి సిద్ధమవుతుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. గుర్తుపట్టారా ఎవరో ? .. ఒక్కప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ మీరా జాస్మిన్.

ఓణి వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి అంటూ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మీరా జాస్మిన్. మొదట సూత్రదారన్ (2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2014లో దుబాయ్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.

ఇవి కూడా చదవండి

చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ మలయాళంలో మకల్ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది మీరా జాస్మిన్. అప్పట్లో ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉన్న ఈ భామా.. ఇప్పుడు అడ్వాన్డ్ గా మారి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. తెలుగులో చివరిసారిగా 2013లో మోక్ష సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.