Tollywood: సాగరుడి హోరు ముందు చిన్నదాని హోయలు.. గ్లామర్ షోతో ఆగం చేస్తోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి..

సాగరుడి హోరు హోయలు పోతున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ సరసన నటిస్తోంది. గుర్తుపట్టారా ? తనే అందాల వయ్యారి

Tollywood: సాగరుడి హోరు ముందు చిన్నదాని హోయలు.. గ్లామర్ షోతో ఆగం చేస్తోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2023 | 1:01 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అందాల తారల చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు హీరోయిన్స్ గ్లామరస్ పిక్స్ కూడా నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇక తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలు.. అరుదైన ఫోటోస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. సాగరుడి హోరు హోయలు పోతున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ సరసన నటిస్తోంది. గుర్తుపట్టారా ? తనే అందాల వయ్యారి ముద్దుగుమ్మ మాళవిక మోహనన్..

1993 ఆగస్ట్ 4న కేరళలోని పయ్యనూర్ ప్రాంతంలో జన్మించింది మాళవిక మోహన్. 2013లో పట్టంపోల్ అనే సినిమాతో మలయాళం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది మాళవిక.

ఇవి కూడా చదవండి

ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా సముద్రపు తీరాన ఫోటో షూట్ చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ తెగ వైరలవుతున్నాయి. ఇక తెలుగులోనూ ఈ అమ్మడుకు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో స్టార్ డమ్ అందుకుంటుందో లేదో.