Guess this Actress: ప్రకృతి నడుమ అందాల దేవకన్య.. ఈ ప్రభాస్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
పైన ఫోటోను చూశారు కదా.. ఆ అందాల దేవకన్య ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మెప్పించింది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సౌత్ టూ నార్త్ స్టార్స్ బాల్యం జ్ఞాపకాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నెట్టింట మరో స్టార్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అందాల దేవకన్య ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ. హిందీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. గుర్తుపట్టండి. ఆ అమ్మాడికి భారీగానే ఫాలోయింగ్ ఉందండి.
ప్రకృతి నడుమన ఉన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురే ఈ శ్రద్ధా కపూర్. 1987 మార్చి 3న ముంబైలో జన్మించిన శ్రద్ధా.. 2010లో టీన్ పట్టి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అషికీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా శ్రద్దా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు బీటౌన్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఏక్ విలన్, ఎబిసిడీ 2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, చిచ్చోరే చిత్రాల్లో నటించి మెప్పించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రద్ధా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు..ఇక శ్రద్ధా చివరగా బేదియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె తూ జూతీ మైన్ మక్కార్ చిత్రంలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.