సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ప్రధాన నిందితుడు అరెస్టైన సంగతి తెలిసిందే. థానేలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ దాడి ఘటనపై ముంబై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. సైఫ్ అలీఖాన్ కేసులో అరెస్టై నిందితుడు బంగ్లాదేశీయుడు. అతడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్. వయసు 30 సంవత్సరాలు.
అతను భారతీయుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడు. కొన్ని నెలల క్రితమే ముంబైకి వచ్చిన అతడు ఆ తర్వాత కొద్దిరోజులు ముంబై నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు 15 రోజుల క్రితమే ముంబై తిరిగి వచ్చిన అతడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేసేందుకు చేరాడు. దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. ఆ సమయంలో అడ్డు వచ్చిన సైఫ్ పై దాడి చేశాడు. ఈ కేసుపై నిందితుడిని కోర్టులో హజరుపరిచి.. ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుంటామని..ఆ తర్వాతే తదుపరి విచారణ ప్రారంభిస్తామని ముంబయి పోలీసులు వెల్లడించారు. సైఫ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక విచారణ ఇంకా కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని 72 గంటల తర్వాత అరెస్టు చేశారు. ముంబయి పోలీసులు, క్రైం బ్రాంచ్‌కు చెందిన 30 బృందాలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ బృందంలో 100 మందికి పైగా అధికారులు ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి కోసం 15కి పైగా నగరాల్లో వెతికారు. చివరకు థానేలో నిందితుడిని అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??
రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

