రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!
తెలంగాణా రాష్ట్రం అసీఫాబాద్ జిల్లాలో ఆదివాసీల సంప్రదాయ ఖాన్‌దేవుని జాతర మొదలైంది. ఈ క్రమంలోనే నార్నూర్ మండల కేంద్రంలో ఖాన్‌దేవుని జాతరలో మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు తొడసం జాతికి చెందిన ఆదివాసీలు. 15 రోజుల పాటు ఖాన్‌దేవుని సన్నిధిలో జాతర జరుగుతుంది.
కొన్ని దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున ఖాన్‌దేవునికి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఖాన్‌దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందు నుంచే ఆదివాసీలు ఇంట్లోనే నువ్వులనూనె తయారుచేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్తులు. మహరాష్ట్ర కోద్దిపూర్ గ్రామనికి చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మెస్రం నాగుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
