గారె తినబోతే.. ప్రాణం పోయింది.. వీడియో
గొంతులో గారె ముక్క ఇరుక్కుపోయి ఊపిరాడక ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..జిల్లాలోని తల్లాడకు చెందిన మొక్కా తిరుపతమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కానీ, తిరుపతమ్మ ఎవరి వద్ద ఉండటం లేదు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంటికి సమీపంలోనే ఓ చిన్న గదిలో నివసిస్తోంది.
సంక్రాంతి పండగ సందర్భంగా అదే గ్రామంలో ఉండే చిన్న కుమారుడు శ్రీను తల్లి వద్దకు వచ్చి గారెలు ఇచ్చివెళ్లాడు. వాటిని తినే క్రమంలో వృద్ధురాలు గొంతులో గారెముక్క ఇరుక్కుపోయింది. దాంతో ఆమె ఊపిరాడక తల్లడిల్లిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం సమయంలో పెద్ద కొడుకు కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆమె చనిపోయింది. కుమార్తె ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్‌లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
వైరల్ వీడియోలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
