అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై తనకున్న మక్కువను వీలున్నప్పుడల్లా చాటుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనువడు కల్వకుంట్ల హిమాన్షు నడుస్తున్నాడు. హిమాన్షు తీరిక సమయంలో తన తాతయ్యతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నాడు. అచ్చమైన రైతన్నలా చెమటోడ్చుతున్నాడు.
పార చేతబట్టి అన్నదాతలా మారిపోయాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయాడు. మనవడు చేస్తున్న పొలం పనిని చూసి కేసీఆర్ కూడా మురిసిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షు తన తాత సూచనలతో తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పాడు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు. సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు సందేశమిచ్చాడు.
Published on: Jan 20, 2025 09:05 AM
వైరల్ వీడియోలు