129 ఏళ్ల వయసులోనూ ..కుంభమేళాకు వచ్చిన బాబా! వీడియో
ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దేశవిదేశాలనుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆరు కోట్ల మందికిపైగా హాజరై త్రివేణి సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఎందరో యోగులు, అఘోరాలు, స్వాములు, సిద్ధులు త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత, యోగా సాధకుడు 129 సంవత్సరాల స్వామి శివానంద బాబా ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాలో పాల్గొన్నారు.
ఆయన గత వందేళ్ల నుంచి ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ లలో జరిగిన అన్ని కుంభ మేళాలకు హజరయ్యారని ఆయన శిష్యులు తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేస్తానని చెప్పారు. ఆయనకు సెక్టార్ 16లో క్యాంపు ఏర్పాటు చేయగా, స్వామి శివానందను సందర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. యోగా సాధకుడుగా ఉన్న ఆయనను గుర్తించిన ప్రభుత్వం 2022లో పద్మశ్రీతో సత్కరించింది. నిరాడంబర జీవితం గడుపుతూ యోగ, ధ్యానంలో విశేష సేవలందించినందుకు గాను స్వామి శివానంద బాబా ఈ పురస్కారం అందుకున్నారు.
మరిన్ని వార్తల కోసం :
మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న భక్తులు.. 3 రోజుల్లో 6 కోట్లు!
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
