మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న భక్తులు.. 3 రోజుల్లో 6 కోట్లు!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే మూడున్నర కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు షాహి స్నాన్‌లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాఢా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది.తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించారు.
మంగళవారం 3.5 కోట్లు, బుధవారం కూడా సుమారు కోటి మంది మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.సంక్రాంతి రోజున ప్రారంభమైన మహా కుంభమేళా శివరాత్రి రోజున ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
