ప్రాణాలు తీస్తున్న పొగమంచు..తస్మాత్ జాగ్రత్త.. వీడియో
దట్టమైన పొగమంచు చుట్టూ కమ్మేస్తే ఎలా ఉంటుంది..? కాశ్మీర్ లోయ కళ్ల ముందే ఉన్నట్టు ఏదో తెలియని ఆనందం వస్తుంది. కానీ మంచును చూసి మురిసేలోపే మృతువు తలుపు తడుతోంది. రహదారులపై రక్తమోడుతోంది. మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుసా..? రహదారులను కమ్మేస్తున్న ఆ పొగ మంచే ఆయువు మింగేస్తుంది.. బాటసారులను బలి కోరుతుంది.. సూర్యుడు ఉదయించక ముందే కొన్ని జీవితాల్లో పొగమంచు కారుచీకట్లు కమ్ముకునేలా చేస్తుంది.నిత్యం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం... ఘోర రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం.. కానీ చలి కాలంలో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య కలవర పెడుతోంది.. అర్థరాత్రి నుండి ఉదయం 8 లోపు జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువని రవాణాశాఖ, పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.. కారణం ఏంటో తెలుసా..?పొగ మంచు.. రహదారులపై పొరలుగా కమ్మేసే పొంగమంచే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. దట్టమైన పొగ మంచు రహదారిని కమ్మేసి చిమ్మ చీకట్లు అలముకున్నా కొందరు ప్రయాణం మాత్రం ఆపడం లేదు.. దట్టమైన పొగమంచులో ప్రయాణం ప్రమాదకరమని తెలుసు..?
కానీ గమ్య స్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా పరుగులు పెట్టే వాహనదారులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు.. పొగ మంచు ప్రభావంతో ముందున్న వాహనాలను గుర్తించలేక కొందరు.. రహదారులపై గుంతలను గమనించలేక జరుగుతున్న మరికొన్ని ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సూర్యుడు ఉదయించక ముందే వాళ్ల ప్రాణాలు ఆ పొగ మంచులో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగ మంచు వల్ల ప్రమాదాల సంభవిస్తున్నాయి.. కొన్ని డేంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా వాహనదారుల్లో మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు.. రహదారులను కామ్మేసిన పొగ మంచు వాహనదారుల ప్రాణాలు మింగేస్తుంది.. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది..ఈ పొగ మంచు ప్రమాదాల వల్ల ఎంతోమంది విగత జీవులుగా మారుతున్నారు..
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్‌లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
