వణుకు పుట్టిస్తున్న విష జ్వరాలు.. ఏ ఇల్లు చూసినా రోగులే.. వీడియో
కృష్ణా జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో నీరసించి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు మాత్రం త్వరగా తగ్గట్లేదు. జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే బాధితులు నీరసిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని, అన్నింటికీ ఒక్కటే మందు ఇస్తున్నారని ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చుపెట్టి అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.అనేక చోట్ల కలుషిత నీరు కారణంగా విష జ్వరాలు చుట్టుముడుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైనేజీ , మంచినీటి పైప్ లైన్ లకు మరమ్మత్తులు చేసి జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్‌లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
