కల్లు సీసాలో కట్లపాము ..తృటిలో తప్పిన ప్రాణాపాయం!
పొద్దంతా కాయకష్టం చేసే కూలీలు సాయంకాలం ఇంటికి చేరే క్రమంలో కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్తుంటారు. అక్కడ ఓ సీసా కల్లు తాగి ఇంటికి వెళ్లిపోతారు. మద్యం కన్నా కల్లు చౌకగా దొరకడం వల్ల కల్లుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే అలా కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తాను తీసుకున్న కల్లు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ సీసాలో కట్ల పాము ప్రత్యక్షమైంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో వెలుగు చూసింది.
కల్లు వ్యాపారులు స్థానికంగా అడ్డా ఏర్పాటు చేసుకుని డ్రమ్ముల్లో కల్లు ఉంచి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కల్లు సీసాలోకి కట్లపాము పిల్ల చేరింది. కల్లు ప్రియులు కల్లు తాగుతుండగా ఒకరి సీసాలో కదులుతున్న కట్ల పాము కనిపించింది. గట్టిగా అరవడంతో తోటి కూలీలు వచ్చి దాన్ని చంపేశారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు కల్లు దుకాణంపై దాడి చేశారు. ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని ఆందోళనకు దిగారు. గ్రామ పెద్దలు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కల్లు నింపే క్రమంలో పరిశుభ్రత పాటించాలని స్థానికులు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్‌లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్.. ఖర్చు రూ. 19 లక్షలా

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

ఐస్క్రీమ్లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక...చివరికి.. వీడియో
