AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆడుకుంటూ బిందెలో తలపెట్టిన నాలుగేళ్ల చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇంట్లో తల్లి పని చేసుకుంటూ బిజీగా ఉంది. బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి బిందె వద్దకు వచ్చి.. కర్రతో కొడుతూ దాని నుంచి వచ్చే శబ్ధాన్ని వింటూ కేరింతలు కొడుతుంది. ఆ తర్వాత ఆ శబ్ధం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని బిందెను చేతిలో ఎత్తి తల లోపల పెట్టింది. అంతే.. ఒక్క సారిగా చిన్నారి తల అందులో ఇరుక్కుపోవడంతో.. చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లితోపాటు ఇరుగుపొరుగు పరుగుపరుగున వచ్చారు..

Telangana: ఆడుకుంటూ బిందెలో తలపెట్టిన నాలుగేళ్ల చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Four Year Old Girl Head Stuck In Metal Vessel
G Sampath Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 21, 2025 | 12:08 PM

Share

హైదరాబాద్‌, జనవరి 21: హాయిగా ఆడుకుంటున్నారు కదా అని చిన్నపిల్లలను గమనించడం మానేస్తే వాళ్లు ఏ క్షణాన ఏ ప్రమాదం కొనితెచ్చుకుంటారో తెలియదు. అందుకే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి తల్లిదండ్రులు. పాప ఆడుకుంటుందని ఓ తల్లి తన పనిలో నిమగ్నమవగా.. ఆ పాప ఖాళీ బిందెతో ఆడుతూ అందులో తల దూర్చింది. ఇంకేంటి.. అందులోనే తల ఇరుక్కుపోయింది. ఎంత తీసినా బయటకు రాక దాదాపు రెండు గంటల పాటు ఇబ్బంది పడింది ఆ పాప. వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య నగర్‌కు చెందిన దంపతులకు లాఫి (4) అనే పాప ఉంది. తల్లి ఇంట్లో తన పని చేసుకుంటుండగా లాఫీ ఇంటి వద్దనే ఆడుకుంటుంది. తల్లి వంటింట్లోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారి ఎదురుగా కనిపించిన బిందెతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అటు ఇటు బిందెను కొడుతూ వచ్చే శబ్దంతో సంతోషపడింది. ఈ క్రమంలో బిందెను ఎత్తి తలపై పెట్టుకుంది. అది గమనించిన తల్లి వచ్చి తలపైన అన్న బిందెను తీయడానికి ప్రయత్నం చేసింది. ఎంతకూ బిందె రాకపోవడంతో ఆందోళనకు గురైంది.

అందులోనే తల ఇరుక్కుపోయి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. దీంతో భయపడిన పాప గట్టిగా కేకలు వేయసాగింది. ఎంత ట్రై చేసినా రాకపోవడంతో భర్తను పిలిచింది. అతడు కూడా కూతురు తలను బిందెలో నుంచి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ విషయం తెలిసి ఇంటి వద్ద ఇరుగుపొరుగు గుమిగూడారు. తలా ఒక చేయి వేసి బిందెలో నుంచి ఆ పిల్లాడి తలను తీయడానికి ప్రయత్నించారు. ఎవరి వల్ల కాకపోవడంతో కట్టర్ సాయంతో బిందెను కోసి పాప తలను బయటకు తీశారు. బిందెలో నుంచి తల బయటకు వచ్చిన తర్వాత కూతురు తల్లి ఒడిలోకి చేరి గట్టిగా పట్టుకుని ఏడ్చింది. చిన్నారి తల బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.