Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డబ్బు కోసం టెకీ అత్యాశ.. డ్రగ్స్‌ పెడ్లర్‌ అవుదామని స్కెచ్‌ వేశాడు! కట్‌చేస్తే..

మంచి జీతంతో పేరు గాంచిన సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొలువు చేస్తున్న అతగాడి బుర్రలో ఓ చెత్త ఐడియా వచ్చింది. అప్పటికే డ్రగ్స్ బానిసై వచ్చిన జీతం వచ్చినట్లు ఖాళీ అవుతుంటే అడ్డదారిలో వేగంగా డబ్బు సంపాదించాలనే దురాశ పుట్టింది అతడిలో. అంతే కారెక్కి నేరుగా పూణె వెళ్లి రూ.21 లక్షల విలువైన డ్రగ్స్ తో హుషారుగా వస్తుండగా రోడ్డుపై ఊహించని షాక్ తగిలింది..

Hyderabad: డబ్బు కోసం టెకీ అత్యాశ.. డ్రగ్స్‌ పెడ్లర్‌ అవుదామని స్కెచ్‌ వేశాడు! కట్‌చేస్తే..
Software Engineer
Follow us
P Shivteja

| Edited By: Srilakshmi C

Updated on: Jan 21, 2025 | 11:28 AM

హైదరాబాద్‌, జనవరి 21: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళకు వచ్చే జీతం కూడా లక్షల్లో ఉంటుంది. వారి లైఫ్‌స్టైల్‌ కూడా కొంత వింతగానే ఉంటుంది. దీనిని సరైన మార్గంలో పెట్టుకుంటేనే లైఫ్ అంతకన్నీ హ్యాపీగా ఉంటుంది. కానీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న ఓ వ్యక్తి మాత్రం వక్రబుద్ధితో ఆలోచనలు చేసాడు. తనకు వస్తున్న జీతం సరిపోవడం లేదని కొత్త దందా మొదలు పెట్టాడు. చివరికి కటకటల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కాడు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన హర్జత్‌ సింగ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. హర్జత్‌ సీంగ్ నిత్యం డ్రగ్స్ తీసుకోవడం వలన, అతనికి వస్తున్న జీతం తానుకొనే డ్రగ్స్ కి సరిపోవడం లేదనీ డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. దీంతో ఎలాగైనా డబ్బులు ఎక్కువగా సంపాదించాలని కొత్త ప్లాన్ వేసాడు. తాను వినియోగిస్తున్న డ్రగ్స్‌ను.. మరి కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా వాడుతున్నారు. దీంతో వారికి తానే డ్రగ్స్ సరఫరా చేయాలని, డ్రగ్స్ వ్యాపారిగా మారాలని ఫిక్స్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇలా డ్రగ్స్ వ్యాపారిగా మారి కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. దానికొసం మహారాష్ట్రలోని పూణేకి వెళ్లి, డ్రగ్స్ తేవడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ నుంచి పూణేకి కారులో వెళ్లి, ఎండిఎంఎ కిస్టల్స్‌ డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకువస్తున్న క్రమంలో హర్జత్‌ సింగ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. పూణే నుంచి 120 మీల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్ వస్తుండగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ ప్లైఓవర్‌ వద్ద డీటీఎప్‌, ఎక్సైజ్‌ పోలీసులు హర్జత్‌ సింగ్‌ణు పట్టుకున్నరు. సోదాల్లో పట్టుబడిన డ్రగ్స్‌, వాహనం విలువ రూ.21.06 లక్షల వరకు ఉంటాయి. కటకటాల పాలైన హర్జిత్ సింగ్ ఆత్యాశకు పోయి.. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.