చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదట కావాల్సింది పౌష్టికాహారం. పోషకాహార లోపం కారణంగా అనేక వ్యాధుల బారిన పడతారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక రకాల వైరస్‌లు, వ్యాధుల నుంచి తట్టుకొని త్వరగా కోలుకోగలుగుతారు. వీటన్నింటికీ మూలం పౌష్టికాహారం. ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. చలికాలంలో కొందరు త్వరగా అలసిపోతుంటారు.
అంటే వీరి శరీరంలో తగినంత మెగ్నీషియం లేకపోవడమే అందుకు కారణం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు. అవేంటో చూద్దాం. సబ్జా గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని వాటర్‌లో నానబెట్టి తాగవచ్చు. లేదంటే జ్యూస్, లేదా సలాడ్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. తద్వారా శరీరానికి రోజంతా కావలసిన శక్తి లభిస్తుంది. అలసట దరిచేరదు. అలాగే బాదం కూడా అధికశాతం మెగ్నీషియం కలిగి ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాదు కొందరికి నిద్రలో కండరాలు పట్టేయడం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఇక ఆకుకూరలను పోషకాల గనులుగా చెబుతారు ఆహారనిపుణులు. పాలకూరలో మనకు కావలసినంత మెగ్నీషియం దొరుకుతుంది. ఇది కండరాల వృద్ధికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే మరో ఆహారం జీడిపప్పు. ఇందులో 74 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అలాగే సోయా పాలలోనూ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. సోయా పాలు, సోయా ఆహార పదార్ధాల్లో 61 మిల్లీ గ్రాముల మెగ్నీషియం దొరుకుతుంది. తరచూ ఈ పదార్ధాలు తీసుకుంటే అలసట రాదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం
సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..
సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??
రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
