Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..

Phani CH

|

Updated on: Jan 20, 2025 | 7:32 PM

డైరెక్టర్ గౌతమ్ మీనన్..ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు. దర్శకుడిగా వెండితెరపై ఎన్నో కథలను రూపొందించిన ఆయన.. ఆ తర్వాత నటుడిగానూ మెప్పించాడు. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తానని అన్నారు. ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా నటించాడు. కానీ విక్రమ్‌ కంటే ముందే పలువురు హీరోలకు ఈ సినిమా స్టోరీ చెప్పానని అన్నారు గౌతమ్. “ధృవ నక్షత్రం కథను ముందుగా వేరే హీరోలకు చెప్పాను. కానీ కొన్ని కారణాలతో అందరూ రిజెక్ట్ చేశారు. వారి అభిప్రాయాలను నేను అర్థం చేసుకున్నాను.. అందుకే నాకేం బాధ అనిపించలేదు. కానీ ఈ కథను హీరో సూర్య కూడా నో చెప్పాడు. ఆ మాటను తట్టుకోలేకపోయాను. సూర్య నో చెప్పడం నన్ను ఎంతోగానో బాధించింది” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!

కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం

సైఫ్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..

సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!